Pages

Tuesday 10 September 2019

Implementation of Kamalesh Chandra Committee recommendations w.e.f.1.1.2016

Date : 10.09.2019

Implementation of Kamalesh Chandra Committee recommendations w.e.f.1.1.2016

జి.డి.యస్ లు అందరికీ శుభవార్త:

కమలేష్ చంద్ర కమిటీ ది.19/11/2015 నాడు ఏర్పాటు చేయబడింది. కమిటీ వారి తుది నివేదికను ది.24/11/2016 న పోస్టల్ డిపార్ట్మెంట్ కు సమర్పించినారు. వెంటనే అమలు చెయ్యాల్సిన కమిటీ రిపోర్ట్ ను దాదాపుగా 18 నెలల తరువాత 6/6/2018 నాడు కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదం తెలిపింది.అదీ కూడా చారీత్రాత్మకమైన 16 రోజుల నిరవధిక సమ్మె చేసిన తరువాత మాత్రమే రిపోర్ట్ అప్రూవ్ అయినది. డిపార్ట్మెంట్ మాత్రం 1/7/2018 నుండి రిపోర్ట్ ను అమలు చేస్తున్నట్లుగా ఆర్డర్ రిలీజ్ చేసినారు.

వాస్తవంగా కమలేశష్ చంద్ర కమిటీ రిపోర్ట్ ను 1/1/2916 నుండి ఇంప్లిమేంట్ చెయ్యలి.కానీ పోస్టల్ డిపార్ట్మెంట్ గత పే కమీషన్ లకు భిన్నంగా 1/7/2018 నుండి కమలేష్ చంద్ర కమిటీ రిపోర్ట్ ను అమలు చేసింది.

కమలేష్ చంద్ర కమిటీ రిపోర్ట్ మొత్తంను 1/1/2016 నుండి అమలు చెయ్యాలని, రూ.10,000/- రూ.12,000/- మరియు రూ.14,500/- నూతన వేజ్ స్కేల్ లను 1/1/2016 నుండి చెల్లించాలని, 3% ఇంక్రిమెంట్ ను 1/1/2016 నుండి చెల్లించాలి అని, కమలేష్ చంద్ర గారు,చైర్మన్ జి.డి.యస్ కమిటీ సూచించిన విధంగా అరియర్ చెల్లించాలి అని *GDS లీగల్ కమిటీ నేషనల్ యూనియన్లు* CAT Hyderabad నందు 12/09/2019 కేసు ఫైల్ చేయ్యబోతున్నారు.

జి.డి.యస్ లకు ప్రతి 10సం,లకు ఒక్కసారి లభించే న్యాయబద్దమైన పే కమిటీ సిఫారసులును న్యాయస్థానం ద్వారా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని మీ అందరకీ హామీ ఇస్తున్నాం.

ఇట్లు 

జి.డి.యస్ లీగల్ కమిటీ 
నేషనల్ యూనియన్లు.

No comments:

Post a Comment