Pages

Friday 1 June 2018

11 వ రోజు నిరవధిక సమ్మె

Date : 1.6.2018

11 వ రోజు నిరవధిక సమ్మె

ఇప్పటిదాకా ఎన్నో సమ్మెలు చూసి ఉంటారు...
రోజులు గడిచే కొద్దీ నిరాశచెందే వారిని చూసి ఉంటారు...
కానీ జి డి యెస్ ల కోసం 
జి డి యెస్ లే చేసే ఆకలి పోరాటం లో రోజు రోజు కి సమ్మె తీవ్రత పెరుగుతుంది తప్ప రాజీపడే ప్రసక్తే లేదు అని 11 వ రోజు కూడా నిరవధిక సమ్మె ని విజయవంతం చేసిన మిత్రులకి ధన్యవాదాలు...

ఈ రోజు ఢిల్లీ లో జి డి యెస్ లు మరియు డిపార్ట్మెంట్ ఉద్యోగులు అందరూ కలిసి సమాచార శాఖామంత్రి కార్యాలయాన్ని (సంచార్ భవన్) ని ముట్టడి చేశారు..
కానీ ఈ మొండి ప్రభుత్వం అధికార బలం ఉపయోగించడానికి ప్రయత్నించారు కానీ సమస్య గురించి ఆలోచించి మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు అంటే వీరు దేశ కార్మికుల కు ఎంత వ్యతిరేకంగా పని చేస్తున్నారో అర్ధమవుతుంది...

మరొక పక్క దేశ వ్యాప్తంగా అన్ని చోట్ల వినూత్నమైన నిరసనలు తెలియచేస్తూ...
కొన్ని చోట్ల బ్యాగ్ లను సైతం అడ్డుకొని డిపార్ట్మెంట్ ఉద్యోగుల్ని కూడా లోపలికి వెళ్లకుండా చెయ్యటం జరిగింది..
ఇదే విధంగా మన సమ్మె ని ఉదృతంగా చేసి మన డిమాండ్ ను సాదించుకోవాలి..

అదే విధంగా ఈ రోజు మనకి మద్దతుగా IPO/ASP/SP సంఘాలు జి డి యెస్ లు ఈ డిపార్ట్మెంట్ కి వెన్నెముక లాంటి వారు వారి సహకారం లేకుండా ఈ డిపార్ట్మెంట్ ని నడపటం కష్టమైనది అని వారి న్యాయమైన కోరిక ను నెరవేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని డైరెక్టరేట్ ను అడగటం చాలా సంతోషం మనం ఉన్న ఈ పరిస్థితులలో వారి మద్దతు మనకి కొండంత బలం చేకూర్చేలా చేస్తుంది అని తెలియచేస్తున్నాను...

సి.హెచ్.లక్ష్మీనారాయణ

1 comment: