Pages

Sunday 3 June 2018

జి డి యెస్ జీవితం

Date : 3.6.2018

జి డి యెస్ జీవితం

ఏ వ్యవస్థ లో కూడా ఎక్కువమంది ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది...
కానీ మన వ్యవస్థ లో 82% మనమే అయినప్పటికీ మనమంతా ఇంకా చెప్పుకోలేని బానిసలుగానే బతుకుతున్నాం...

ఆదాయం కంటే అప్పులు ఎక్కువ...
మూల స్తంభాలు అంటూ బరువులు నెత్తిన పెట్టి బాధ్యత అంటారు...
పునాది మీరు అంటారు..
ఆ పునాధిలో మా సమాధి కడతారు...

పొదుపు గురించి చెప్తూ పొదుపు అనే మాట కూడా వాడలేని బతుకులు.....
సంక్షేమ పథకాలు ప్రజలకి చేరువ చేస్తూ సంక్షేమమే లేకుండా జీవిస్తున్న వాళ్ళం..

చావు వస్తే దహనసంస్కారాలకి కూడా నోచుకుంటామో లేదో అన్న భయంతో....
పదవి విరమణ పొందితే ఎక్కడ భిక్షాటన చెయ్యలేమో అని బెదురుతో రోజు చస్తున్న బాధితులం...

చేతిలో అన్నం ఇంకొకరి పెట్టలేక...
చేతిలో కూడు కూడా పెట్టిన వాడే లాక్కుంటుంటే అరవలేక..
చివరికి ఇంకొకడిని చేయి చాచి అడగలేక దిన దిన గండం గా బతుకుతున్న జి డి యెస్ బతుకులు...

ఇక్కడ నుంచి ఏదో సాదించగలం అన్న యువతరం ఆశల మీద నీళ్లు చల్లుతూ...
తర తరాలుగా మార్పు వస్తుంది అని ఆశగా ఎదురుచూస్తున్న పెద్దల ఆశలు ఎండమావులుగా మారుస్తూ...

వారి రక్తంతో మీరు తినే రక్తపు కూడు మీకు ఎలా ఒంటికి పడుతుంది అయ్యా....
వారి చెమట కష్టం తో వచ్చే విలాసవంతమైన జీవితం బతకటానికి మీకు ఎప్పుడైనా సిగ్గుఅనుపిస్తుందా అయ్యా...

జి డి యెస్ ల రక్త మాంసాలను తింటున్న ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి మీ జీవితాలు చరమాంకంలో చేరే రోజులు దగ్గర ఉన్నాయి.....

మీ అమర శేషు

1 comment:

  1. We'll be with you sir untill pay committee will get implemented. The JCA is only hope for us. We are ready to sacrifice our life also.

    ReplyDelete