Pages

Tuesday 26 June 2018

06-06-2018 నాడు కేంద్ర క్యాబినెట్ చేత ఆమోదించబడిన GDS పే కమిటీ రిపోర్ట్ ను ఇంతవరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఎందుకు బహిరంగం చెయ్యలేదు...?

Date : 26.06.2018

06-06-2018 నాడు కేంద్ర క్యాబినెట్ చేత ఆమోదించబడిన GDS పే కమిటీ రిపోర్ట్ ను ఇంతవరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఎందుకు బహిరంగం చెయ్యలేదు...?

ఆమోదం పొందిన 20 రోజుల తరువాత కూడా డిపార్ట్మెంట్ కేవలం పే మరియు అలెవెన్సు కు సంబందించిన ఆర్డర్ ను మాత్రమే విడుదల చెయ్యటం లో ఆంతర్యం ఏమిటి?

అరియర్స్ విషయంలో శ్రీ కమలేష్ చంద్ర గారు 2.57 కి బదులుగా సూచించిన కరస్పాండింగ్ స్కేల్స్ ను ఎందుకు పరిగణలోనికి తీసుకొని డిపార్ట్మెంట్ ఆర్డర్ విడుదల చేయలేదు...?

లక్షల రూపాయల అరియర్స్ ను GDS లకు చెల్లించుటకు కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదా? లేక డిపార్ట్మెంట్ లోని ఉన్నతాధికారులు అహం అడ్డుపడిందా..?

కమిటీ రిపోర్ట్ ఆమోదం పొందటానికి ఎందుకు 18 నెలల సమయం పట్టింది?

కాలయాపన నియంత ప్రభుత్వపాలన చేస్తున్న కేంద్ర ప్రభుత్వానిదా? లేక GDS శవాల మీద చిల్లర ఏరుకునే అధికార యంత్రాంగానిదా....?

*కమలేష్ చంద్ర ఇచ్చిన రికమండేషన్స్ ను డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఎందుకు మార్చవలసి వచ్చింది....?*

అరియర్స్ విషయంలో వచ్చిన వ్యత్యాసానికి బాధ్యత ఆర్థిక శాఖదా? లేక డిపార్ట్మెంట్ దా?

3,4 సంవత్సరాల నుండి GDS లకు చెల్లించాల్సిన ఇన్సెంటివ్స్ చెల్లించక పోవుటకు కారణం డిపార్ట్మెంటా ? లేక కేంద్ర ప్రభుత్వమా....?

ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్న POST BANK OF INDIA ను సాదించుటకు కారణం డిపార్ట్మెంటా ? లేక కేంద్ర ప్రభుత్వమా..? లేక 
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు విస్తృతమైన నెట్ వర్క్ కలిగి అత్యుత్తమమైన సేవలు  అందిస్తున్న GDS లా...?

పైన పేర్కొన్న ఎన్నో ప్రశ్నలకి సమాధానం డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్... *ఇది నగ్న సత్యం.*

*GDS పే కమిటీ రిపోర్ట్ లో ఇన్ని మార్పులు రావటానికి డైరెక్టరేట్ లోని ఉన్నతాధికారులే కారణం..!*

యూనియన్ నాయకుల ఉప్పొంగే ఉపన్యాసాలు,DOP కపట ప్రేమ మరియు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి ఈ రోజు సగటు GDS జీవనాన్ని అతలాకుతలం చేస్తుంది...

పోరాటాన్ని ప్రేరేపించే వారు, పోరాటాన్ని అభిలాషించేవారు కూడా ఒక్క నిమిషం అలోచించండి.!

GDS వ్యవస్థ లో సమూలమైన మార్పులు రావాలంటే ఏమి చెయ్యాలి..!

అది కేవలం మన అరియర్స్ ని పెంచుకోవడం కోసమో..లేక 
గ్రాట్యుటీటీ ని పెంచుకోవడం కోసమో కాదు..!

* ఇండియా పోస్ట్ నిర్మాణానికి రాళ్లు ఎత్తిన కూలీలు ఎవ్వరు..?*
అని ప్రశ్నించాల్సిన సమయం  ఆసన్నమైంది.....

*మరో ప్రపంచం పిలుస్తుంది..*
ఆ దిశగా నాయకులు,సంఘాలు ముందుకు నడిచి GDS వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకువస్తారని ఆశిస్తూ...

సి.హెచ్.లక్ష్మీ నారాయణ
సర్కిల్ సెక్రటరీ (NUGDS)

No comments:

Post a Comment