Pages

Tuesday, 22 May 2018

Date : 22.05.2018

ఈ రోజున జరిగిన నిరవధిక సమ్మె చారిత్రాత్మకమైనది. జి డి యస్ లకు కమలేష్ చంద్ర కమిటీ రిపోర్ట్ ను వెంటనే అమలు చెయ్యాలని ఈ రోజు నుండి దేశ వ్యాప్తంగా 270000  మంది జి డి యస్ లు   మొదలు పెట్టిన నిరవధిక సమ్మెకు మద్దతు గా మన ఆంధ్ర ప్రదేష్ సర్కిల్ లో డిపార్ట్మెంట్ ఉధ్యోగులు కూడా సమ్మె చెయ్యటం జి డి యస్ లకు నైతికంగా ఎంతో ధైర్యం ఇవ్వడం తో పాటుగా సమ్మె శాతం 90% నమోదు కావటం ట్రేడ్ యూనియన్ చరిత్ర లో నవశకం నకు నాంది పలికింది. 

కావున ప్రతి ఒక్కరికీ విప్లవ అభినందనలు మరియు పేరు పేరున ధన్యవాదములు తేలియపరుస్తున్నాను. రెండో రోజు జరగబోవు రేపటి సమ్మె లో డిపార్ట్మెంట్ ఉధ్యోగుల శాతం ను 100% గా నమోదు చేస్తారని కోరుచున్నాము. డిపార్ట్మెంట్ ఉధ్యోగులు ఎవ్వరూ కూడా సమ్మె లో పాల్గొనటం గురించి ఎలాంటి అపోహలు పేట్టుకోవద్దు. 

ఈ సమ్మె విషయం లో రాష్ట్ర సంఘం అదే విధంగా కేంద్ర సంఘం కూడా ఉధ్యోగులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసుకుంటుంది. జి డి యస్ లకు జీవన్మరణ సమస్య గా మారిన కమిటీ రిపోర్ట్ అమలు విషయం లో కడ వరకూ జి డి యస్ సోదరసోదరీమనులకు అండగా నిలబడి కార్మిక హక్కులు కాపాడుదాము. ప్రతి డివిజన్ సేక్రటరీ వారి డివిజనలో ఉన్న అందరి డిపార్ట్మెంట్ ఉధ్యోగులని సమ్మె లోనికి తీసుకు రావలసింది గా కోరుతున్నాను.వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత.     
                  మీ సోదరుడు    
                 శివాజి వాసిరెడ్డి    
            పోస్టల్  JCA ఛైర్మన్    
              ఆంధ్ర ప్రదేశ్ సర్కిల్.

No comments:

Post a Comment