Pages

Sunday, 27 May 2018

6 వ రోజు నిరవధిక సమ్మె

Date : 27.05.2018

6 వ రోజు నిరవధిక సమ్మె
కురుక్షేత్రం లో అయినా విరామం ఉంటుందేమో కానీ..
కడుపుమంట తో చేసే
తిరుగుబాటు కి విరామం ఉండదు అని మరొక్కసారి రుజువు చేసిన జి డి యెస్ మిత్రులకి వందనం...

6 వ రోజు అయినప్పటికీ ఎవరికి అలుపు అనేది లేదు..
మాకు విశ్రాంతి వద్దు....
మా కష్టాలకు కొంత ఊరట ఇవ్వండి......
అని ఎండ ఎలా ఉన్నా... కడుపు లో బాధ కంటే ఎక్కువ కాదని లెక్కచేయకుండా  భారీ ర్యాలీ లు నిర్వహించి మరెన్నో వినూత్న కార్యక్రమాలు నిర్వహించి నిరసన తెలియచేస్తూ నిరవధిక సమ్మె ని విజయవంతం చేస్తున్న మిత్రులకి ధన్యవాదములు...

ఇదే ఉత్తేజం తో సోమవారం కూడా మరెన్నో నిరసన కార్యక్రమాలు చేస్తూ సమ్మె ని కొనసాగించాలని కోరుకుంటున్నాను....

విప్లవాభివందనాలతో
సి.హెచ్.లక్ష్మీనారాయణ

No comments:

Post a Comment