Pages

Wednesday, 30 May 2018

9 వ రోజు నిరవధిక సమ్మె

Date : 31.05.2018

9 వ రోజు నిరవధిక సమ్మె

అప్పట్లో నవరాత్రులు జరుపుకోవాలంటే రాక్షస సంహారం జరగాలి...
మరి ఇప్పుడున్న రాక్షసులని ఎదురుకుంటూ 9 రోజులు పోరాటం చేస్తున్నాం...

నవరాత్రులు జరుపుకొనే రోజు కోసం నిరంతరం పోరాటం చేస్తూ 9 వ రోజు కూడా నిరవధిక సమ్మె ని విజయవంతం చేసిన జి డి యెస్ మిత్రులకి ధన్యవాదాలు..

ఈ రోజు కొంత మంది ధైర్యం చేసి ఆమరణ నిరాహారదీక్ష లు చేస్తుంటే...మరో వైపు మద్దతుగా రిలే నిరాహారదీక్ష లు చేస్తుంటే...
ఇంకో వైపు నిరసనలో పాల్గొంటూ తన ప్రాణాలనే త్యాగం చేసిన జి డి యెస్ మిత్రుడు...
వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను...

ఇంకెంతమందిని
ఈ ప్రభుత్వం..
ఈ అధికారులు 
పొట్టన పెట్టుకుంటారు...
చెప్పండి ఇంకా మీకు ఎన్ని ప్రాణత్యాగాలు కావాలో మరెన్ని కుటుంబాల ఉసురు పోసుకుంటారో....

దయచేసి ఎవరు కూడా ప్రాణత్యాగాలు చెయ్యకండి...
మరొక్క ప్రాణం రాలిపోకముందే...
రేపటి నుంచి ప్రతి ఒక్కరూ సామూహికంగా ఆమరణ నిరాహారదీక్ష కి వెళ్లి సమ్మె ని ఉదృతం చేసి సత్వరమే విజయం సాధించేలా పోరాడదాము......

విప్లవాభివందనాలతో
సి.హెచ్.లక్ష్మీ నారాయణ

No comments:

Post a Comment