Pages

Thursday, 31 May 2018

Date : 1.6.2018

10 వ రోజు నిరవధిక సమ్మె

ఆకలి పోరాటం లో మొండి ప్రభుత్వం మరియు డిపార్ట్మెంట్ ఎత్తుగడలకి ఎదురెళ్ళటానికి దశావతారాలు ఎత్తిన జి డి యెస్ ఉద్యోగులు....
10 వరోజు కూడా నిరవధిక సమ్మె ని విజయవంతం చేసిన జి డి యెస్ మిత్రులకి ధన్యవాదాలు...

అధికారుల బెదిరింపులు ఒక వైపు...
ఆమరణ నిరాహారదీక్ష లు మరొక వైపు....
విడతల వారి బుజ్జగింపులు ఒక వైపు....
విడతల రిలే దీక్షలు మరొక వైపు...
మీ జీతాల కోసం మా పని అని అధికారుల మాట ఒక వైపు...
మావి ఒక జీతాలేనా అని జీతాలు లేకుండా పోరాటం మరొక వైపు....

చాలా చోట్ల రిలే నిరాహారదీక్ష లు చెయ్యటం జరుగుతుంది..
అవసరమైతే అన్ని చోట్లా కూడా ఆమరణ నిరాహారదీక్ష కి  కూర్చుంటామని జి డి యెస్ లు స్వచ్చందంగా పాల్గొంటున్నారు..
వారికి నా జోహార్లు....

ఇదే విధంగా 11 వ రోజు సమ్మె ని కూడా ఉదృతంగా చెయ్యాలి అని మన సమ్మె గురించి world trade union వారు చాలా గొప్పగా ఆర్టికల్ రాసి వారి మద్దతు మనకు ప్రకటించారని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను....

విప్లవాభివందనాలతో
సి.హెచ్.లక్ష్మీ నారాయణ

No comments:

Post a Comment