Pages

Monday 8 April 2019

NUGDS Circle Secretary Statement

Date : 8.4.2019

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేస్తున్న గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యలును పరిష్కరించకుండా ఎలా ఈ ప్రభుత్వాలు IPPB మరియు RICT మొదలు పెడతారు.

భారత దేశం లో ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉధ్యోగులలో లేని వివక్ష కేవలం భారత తపాలా శాఖలో పని చేస్తున్న గ్రామీణ తపాలా ఉద్యోగులకు ఎందుకు ?

అయ్యా ! కేంద్ర మంత్రులారా 

మీ పార్లమెంట్ సభ్యులకు అదేవిధంగా చాలా మంది కేంద్ర మంత్రులకు లేనటువంటి చదువు మా జి.డి.యస్ లకు ఉంది.

మా ఉద్యోగ అర్హత కేవలం పదవ తరగతి మాత్రమే. కానీ గత దశాబ్దం నుండి పి.జి, పి.హెచ్.డి చేసిన వారు ఈ చాలీ చాలని ఉధ్యోగం లో చేరుతున్నారు.

వారికి మీరు చెల్లించే జీతం,అసంఘటిత కార్మికులకు మరియు ప్రైవేట్ రంగ వ్యక్తుల జీతం కంటే తక్కువ.

పైగా చేస్తున్న ఉధ్యోగం తో పాటుగా ఇతర ఆదాయ మార్గాలు ఉండాలి అనే ఒక నిబంధన.

మీరు తీసుకువచిన పధకాలు మరియు IPPB  & RICT  లను చేస్తూ మేము ఇతర ఆదాయ మార్గాలు చూసుకునే పరిస్తితి ఉంటుందా ?

MAKE IN INDIA అంటే ఇదేనా ?

ఒక్క రోజు ఒక MLA/MLC శాసన సభ /శాసన మండలి సమావేశాలకు వస్తే,అదే విధం గా లోక్ సభ /రాజ్య సభ సమావేశాలకు వస్తే వారికి జీవితాంతం పెన్షన్.

మీకు అంత అనుకూలంగా చట్టాలు చేసుకున్నప్పుడు మా జి.డి యస్.ల గురించి ఎందుకు ఇప్పటి వరకూ చట్టం చెయ్యరు ?

జి.డి.యస్ ఎంగేజ్మెంట్ రూల్స్ 2011 ను మార్చి జి.డి.యస్ లకు కూడా ఒక చట్టాన్ని ఎందుకు చెయ్యరు ?

సి హెచ్.లక్ష్మీ నారాయణ

No comments:

Post a Comment