Pages

Monday 8 April 2019

Circle Secretary Statement : April Membership Verification

Date : 8.4.2019

డియర్ డివిజనల్ /బ్రాంచ్ సెక్రటరీస్ మరియు సి.డబ్ల్యూ.సి.మెంబర్స్ 

2017 లో జరిగిన మెంబర్షిప్  వెరిఫికేషన్ రద్దు అయింది. తదుపరి ఎప్పుడు జరుగునో ఇంత వరకూ డైరెక్టరేట్ క్లారిటీ ఇవ్వలేదు.

కాబట్టి ప్రతి సం,ఏప్రియల్ నెలలో తీసుకొనే డిక్లరేషన్ లను కొత్తగా ఉధ్యోగం లో చేరిన వారి దగ్గర నుండి అదే విధంగా వేరే యూనియన్ నుండి మన NUGDS నందు చేరగోరే వారి వద్ద నుండి తీసుకోగలరు.

సెక్రటరీలు అందరూ ఎంతో ఓర్పుతో,నేర్పుతో ముందుకు సాగాలని, గ్రూప్ -సి  మరియు గ్రూప్ -డి నేషనల్ యూనియన్లు  సహాయ సహకారాలతో మన NUGDS సాధించిన విజయాలను సభ్యులకు వివరించి మనకి అధిక సభ్యత్వం నమోదు చేయ్యగలరని విశ్వసిస్తున్నాను.

దేశవ్యాప్తంగా మన NUGDS రెండొవ స్తానంలో ఉంది. అదే విధంగా మన సర్కిల్ లో కూడా రెండొవ స్తానం లో ఉంది. రెండో స్తానం లో ఉన్న మన యూనియన్  జి.డి.యస్ లకు అడ్డంకిగా ఉన్న ఎన్నో విషయాలను వెలుగులోకి తీసుకురావటం జరిగింది. తద్వారా అధికార యంత్రాంగం మీద అదే విధంగా కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ మీద ఒత్తిడి తీసుకు రావటం జరిగింది.

అంతే కాకుండా "రూల్ 3 A రద్దు చెయ్యలి" & "జి.డి యస్ లు అందరికీ 8గంటలు పని గంటలు కల్పించాలి " అన్న డిమాండ్ లను జి.డి.యస్ వర్గానికీ అంతటికీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకూ కూడా తీసుకువెళ్ళటంలో మన NUGDS ప్రధాన భూమిక పోషించింది. ఇది మన NUGDS మొదటి విజయం.

SO CALLED GDS UNIONS అన్నీ కూడా కుర్చీల కోసం,పదవి కోసం,అధికారం కోసం మాత్రమే పని చేస్తున్నాయి.

IPPB, RICT మొదలగు అదనపు భాద్యతలు జి.డి.యస్ లు నిర్వర్తిస్తున్న ఇలాంటి తరుణంలొ వ్యవస్థ లొ సమూల మార్పుల కోసం NUGDS ని బలపరిచి మన యూనియన్ కి సంఖ్యా బలాన్ని పెంచగలరని కోరుచున్నాను.

ప్రత్యర్ధులు రక రకాల వదంతులు జి.డి.యస్ లకు చేరవేస్తున్నారు, మరీ ప్రత్యేకించి NUGDS సభ్యులకు.

వదంతులు నమ్మ వద్దు. NUGDS బలోపేతానిక అందరూ భాగస్వామ్యులు కాండి.

సభ్యత్వం నమోదు పత్రం క్రింద జతపరచటం జరిగింది.

 సభ్యత్వం నమోదు పత్రాలను డివిజనల్ అధికారి / పోస్ట్ మాస్టర్ గార్లకు సమర్పించటానికి చివరి తేదీ :   ఏప్రియల్ 30 

ప్రతి రోజు మన యూనియన్ సాదించిన అన్నీ విషయాలను సోషల్ మీడియా ద్వారా మీకు చేరవేస్తాను. ఆ విషయాలు అన్నింటినీ జి.డి.యస్ లకు చేర్చండి.

సి.హెచ్.లక్ష్మీ నారాయణ


No comments:

Post a Comment