Pages

Monday 7 May 2018

సగటు జి డి యెస్ పరిస్థితి

Date : 07.05.2018

సగటు జి డి యెస్ పరిస్థితి

పేరుకేమో కేంద్రప్రభుత్వ ఉద్యోగం...
పేరులో ఉన్న హుందాతనం
జి డి యెస్ బతుకులలో మాత్రం కనపడదు....!!

మిగిలిన కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలలో ఉద్యోగస్థులతో పోలిస్తే జి డి యెస్ లది దుర్భర జీవితం...విద్యార్హత ఒక్కటే కానీ ఉద్యోగం లో ఎదుగుదల లేనిది మనకే....!!!

అంగన్ వాడీ టీచర్స్ 10 సం లు పూర్తి చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా భర్తీ కాబడే ICDS సూపర్ వైజర్ ( రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు) లలో 50% కోటా వీరికి కేటాయించబడుతుంది.ఈ స్కీం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలుచేస్తున్నారు.

పైగా అంగన్వాడి కార్యకర్తలను EPF మరియు ESI పరిధిలోకి తీసుకోవటానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి విధి విధానాల తయారీకి మాజీ కేంద్ర కార్మిక శాఖా మాత్యులు శ్రీ బండారు దత్తాత్రేయ గారు ఒక సర్ కమిటీ ని ఏర్పాటు చేయటం జరిగింది..

రాష్ట్ర ప్రభుత్వం లో 10 వ తరగతి విద్యార్హత తో ఉద్యోగం చేస్తున్న VRA లు కూడా 10 సం ల లోపు VRO గా పదోన్నతి పొందుతున్నారు.

డిగ్రీ అర్హత కలిగిన VRA లు వారి పదవీవిరమణ లోపు రెవిన్యూ ఇన్స్పెక్టర్ గా MRO లుగా పదోన్నతి పొందే అవకాశం ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి.

హోంగార్డు లకు POLICE RECUIRMENT లో 10% కోటాను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి..

మరి 30 నుండి 35 సం లు సర్వీస్ పూర్తి చేసినా కానీ ఒక జి డి యెస్ ఉద్యోగి GDS ఉద్యోగిగానే ఎందుకు మిగిలిపోతున్నాడు...????

డిపార్ట్మెంట్ పొరపాటా...????
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్లక్ష్యమా....?????

గాయాలకి అలవాటు పడి అన్యాయాన్ని ఎదిరించకుండా ఇలాగే ఉండిపోదామా.....???

ఇకనైనా మేలుకొని పోరాడదామా.......????

అలోచిస్తారని ఆశిస్తూ...

మీ అమర శేషు

1 comment:

  1. Well sir i ts really painful we should bring this will publish all social medias

    ReplyDelete