Pages

Friday, 14 October 2016

పోస్టాఫీసుల్లో సబ్సిడీపై పప్పులు!: కేంద్రం

Date : 15.10.2016

పోస్టాఫీసుల్లో సబ్సిడీపై పప్పులు!: కేంద్రం 


న్యూఢిల్లీ, అక్టోబరు 14: కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పుల కోసం ఇకపై ఏ రిటైల్‌ స్టోర్‌కో వెళ్లి.. చెప్పినంత ధర చెల్లించాల్సిన పనిలేదు. సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్తేచాలు! సబ్సిడీపై పప్పులు కొనుక్కోవచ్చు. ఏంటి ఆశ్చర్య పోతున్నారా? నిజంగానే. ఇక నుంచి దేశంలోని 1.54 లక్షల పోస్టాఫీసుల్లో కంది, మినప, శనగ పప్పులను సబ్సిడీ ధరలపై అన్ని వర్గాల వారికీ విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు వినియోగదారుల వ్యవహారాలపై ఏర్పాటైన మంత్రుల సంఘం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పండగల సీజన్‌లో పప్పుల ధరలు నింగినంటడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన కమిటీ ఇకపై అన్ని పోస్టాఫీసుల్లోనూ పప్పులను సబ్సిడీ ధరలపై అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ‘‘ప్రభుత్వం తరఫున ప్రస్తుతానికి ఎలాంటి వ్యాపార సంస్థలూ లేవు. దీంతో వినియోగదారులు అధికమొత్తాలకు పప్పులను కొనాల్సివస్తోంది’’ అని ఉన్నతాధికారి చెప్పారు.

No comments:

Post a Comment