Pages

Thursday, 15 March 2018

NUGDS Circle Secretary, AP & President CHQ Statement : Indefinite Hunger Strike.

Date : 15.03.2018

NUGDS Circle Secretary, AP & President CHQ Statement : Indefinite Hunger Strike.

ఒక ట్రేడ్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు నిరవధిక నిరాహారదీక్ష మూడు రోజులు చేసినప్పటికీ అధికార యంత్రాంగం సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోకపోగా ఒక వైపు చర్చలు పేరుతో కాలయాపన చేసి మరొక వైపు పోలీస్ శాఖతో కుమ్మక్కై దీక్షను భగ్నం చెయ్యటం జరిగింది..

GDS ల సమస్యల పరిష్కారానికి ముందుకు రావాల్సిన ఈ అధికార యంత్రాంగం ఇలాంటి ద్వంద వైఖరి ప్రదర్శించటం ఎంతవరకు సమంజసం...!!

డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ ముందు ముందు ఇలాంటి కార్యచరణతోనే ముందుకు వెళితే మేము కూడా రెట్టించిన ఉత్సాహంతో మరెన్నో పోరాట కార్యక్రమాలు చేస్తాము.. GDS లను అణగదొక్కాలనుకున్న ప్రతి సారి మేము ఇంకా ఎక్కువ స్థాయి లో ప్రతిఘటిస్తాము.

NUGDS విశాఖపట్నం నందు చేసిన నిరవధిక నిరాహారదీక్ష కు వచ్చి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు తెలియపరుచుచున్నాను..

అదేవిధంగా రిలే నిరాహారదీక్ష చేసిన మరియు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియపరిచిన అందరికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను..

విశాఖపట్నం నందు జరిగిన దీక్ష ఆరంభం మాత్రమే..

త్వరలో మన విస్తృత కార్యాచరణ తెలియపరుస్తాము

మీ సి.హెచ్.లక్ష్మీ నారాయణ

No comments:

Post a Comment