Pages

Tuesday, 6 March 2018

GDSపే కమిటీ రిపోర్ట్ ను వెంటనే అమలు చెయ్యాలని కోరుతూ NUGDS All India President Ch.Laxmi Narayana నిరవధిక నిరాహార దీక్ష

Date : 6.3.2018

GDSపే కమిటీ రిపోర్ట్ ను వెంటనే అమలు చెయ్యాలని కోరుతూ NUGDS All India President Ch.Laxmi Narayana  నిరవధిక నిరాహార దీక్ష

                    *ఛలో విశాఖపట్నం*

28.02.2018 నాడు క్రింద పేర్కొన్న డిమాండ్ల సాధన కోసం, 12.03.2018 నుండి నిరవదిక నిరాహార దీక్ష చేపట్టుటకు సెక్రటరీ, డిపార్ట్మెంట్ అఫ్ పోస్ట్స్ న్యూ ఢిల్లీ వారికీ నోటీసు సమర్పించడం జరిగింది.

డిమాండ్లు:

1. జి డి ఎస్ లకు సివిల్ సర్వెంట్ హోదా లభించుటకు అనుకూలమైన  ED (Conduct & Service) Rules ,1964 ను తిరిగి కల్పించి దానికి అనుగుణంగా ప్రస్తుత GDS Conduct & Engagement Rules,2011ను మార్చవలెను.

2. GDS లు ఎవ్వరు కూడా 5 గంటలకు మించి పని చెయ్యకూడదు అని చెప్తున్న ప్రస్తుత రూల్ 3A(i),2011 GDS Conduct & Engagement రూల్ ని తొలగించి , 26.10.2016 వ తేదిన భారత సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన “సమాన పనికి సమాన వేతనం” తీర్పు ప్రకారం GDS లు అందరికి జీత భత్యాలు చెల్లించాలి.

3. 24.11.2016 వ తేదిన GDS పే కమిటీ చైర్మన్ శ్రీ కమలేశ్ చంద్ర గారు డిపార్ట్మెంట్ అఫ్ పోస్ట్స్ కు సమర్పించిన రిపోర్ట్ ను యదాతదంగా వెంటనే అమలుచెయ్యాలి. 

దీక్షాస్థలం : మహాత్మా గాంధీ విగ్రహం,మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఎదురు, RTC కాంప్లెక్స్  దగ్గర, విశాఖపట్నం.

దీక్ష మొదలు తేది : 12.03.2018 ఉదయం 10 గంటలకు 

దీక్షచేయువారు    :  సి.హెచ్.లక్ష్మినారాయణ ( సర్కిల్ సెక్రటరీ & ఆలిండియా ప్రెసిడెంట్ )

రండి....కదలి రండి ... డిపార్టుమెంటు మరియు కేంద్ర ప్రభుత్వం GDS ల పట్ల చూపిస్తున్న వివక్షను తరిమికొడదాం .....

సి.హెచ్.లక్ష్మీ నారాయణ.

2 comments:

  1. U have all our support sir..
    Salute to ur leadership

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete