Pages

Friday, 23 March 2018

Circle Secretary,NUGDS Statement

Date : 23.03.2018

బి.పి.యం వేరే ఇతర డ్యూటీలు అంటే మెయిల్ సరఫరా మరియు మెయిల్ డెలివరీ చేస్తుంటే అతనికి ఇంకొక పొస్ట్ ఇవ్వమని డైరెక్టరేట్ ఆర్డర్ వెలువరిస్తే, దానిని అమలు చెయ్యటం ఎవ్వరికీ చేతకాలేదు !

ఆ ఆర్డర్ ఇచిన,డిల్లీ పోస్టల్ డైరెక్టరేట్ ను ఆర్డర్ అమలు పరచాల్సినిదిగా సర్కిల్ ఆఫీస్ ల కు ఉత్తర్వులు ఇవ్వమని ఎన్నో సార్లు అడిగాము !

సర్కిల్ అధికార యంత్రాంగం ను కూడా సదరు ఆర్డర్ ల ను వెంటనే అమలు పరచమని కోరటం జరిగింది !

ఫలితం జీరో !

డివిజనల్ /సబ్ డివిజన్ అధికారులు చెప్పినట్లుగా టార్గెట్ లు చేయలేక పోయిన వారికి,వారి బి.ఓ లో పనిచేస్తున్న యమ్.సి /యమ్.డి ల ను తొలగించి ఆ విధులను కూడా బి.పి.యమ్ కు అప్ప చెప్తున్న ఇలాంటి పరిస్తితుల్లో...

డైరెక్టరేట్ ఉత్తర్వు లను అమలు పరచని వారిని ఏమీ చెయ్యలి ?

ఒక వైపు ఐ.పి.పి.బి అంటారు,మరొక వైపు ఆర్.పి.ల్ ఐ అంటారు,ఇంకొక వైపు ప్రధాన మంత్రి పధకాలు,సుకన్య అకౌంట్స్  అంటారు,చివరిగా ఆర్.ఐ.సి.టి  అంటారు.

5 గం,లకు మించి జీతం ఇవ్వము అంటారు,రోజు ఇంటింటికీ వెళ్ళి అయినా లక్షల టార్గెట్ లు చెయ్యమంటారు,చెయ్యక పోతే జీతం తగ్గిస్తాము అంటారు,లేదంటే బి ఓ లో మిగతా పోస్టులు (రూల్స్ ఒప్పుకోక పోయినా కానీ ) తీసివేసి ఆ పోస్టుల ను కూడా మీ చేతనే చేపిస్తాము అంటారు.

ఇది ఎక్కడ న్యాయం !

బి.పి.యం కి  5 గం,పని గంటలు దాటిన తర్వాత అతనికి వేరే డ్యూటీ లు జత చెయ్యటానికి వీలు లేదు.సర్కిల్ స్థాయిలో అలాంటి కేసుల వివరములను సర్కిల్ యూనియన్ కు పంప గలరు.

ఏ వ్యవస్థ లో నైనా అరాచకం పెరిగింది అంటే విప్లవం తారాస్థాయికి చేరుతుంది. సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి.

సి హెచ్ లక్ష్మీ నారాయణ

No comments:

Post a Comment