Pages

Friday, 22 November 2019

గ్రామీణ డాక్ సేవక్ ల సమస్యలు పరిష్కరించండి

Date : 23.11.2019

గ్రామీణ డాక్ సేవక్ ల సమస్యలు పరిష్కరించండి

➖ కేంద్రమంత్రి కి ఖమ్మం ఎంపీ ,TRS లోక్ సభపక్ష నేత శ్రీ నామ నాగేశ్వరరావు గారు లేఖ.

✍️ పోస్టల్ శాఖలో పనిచేస్తున్న గ్రామీణ డాక్ సేవక్ ల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత కేంద్ర టెలీ కమ్యూనికేషన్ శాఖామంత్రి రవిశంకర్ ప్రసాద్ గారికి ఖమ్మం పార్లమెంట్ సభ్యులు,TRS లోక్ సభపక్ష నేత శ్రీ నామ నాగేశ్వరరావు గారు బుధవారం నాడు లేఖ రాశారు.

గ్రామీణ డాక్ సేవకులు ఎంతో కాలంగా పరిష్కారానికి నోచుకోని పలు సమస్యలపై జాతీయ గ్రామీణ డాక్ సేవక్ యూనియన్, హైదరాబాద్, ఖమ్మం జిల్లా నాయకులు ఎంపీ నామ నాగేశ్వరరావు గారిని ఇటీవల కలసి వినతిపత్రం అందజేశారు. వారి వినతి మేరకు వెంటనే స్పందించిన ఆయన  కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ గారికి రాసిన లేఖలో కేంద్ర ఆర్దికమంత్రిత్వ శాఖతో చర్చలకు చొరవ తీసుకుని డాక్ సేవక్ ల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. 

దేశ వ్యాప్తంగా మూడు లక్షల మంది పని చేస్తున్నారని ,వారందరికీ నామమాత్రపు వేతనాలు చెలిస్తున్నారన్నారని లేఖలో పేర్కొన్నారు. వారికి సామాజిక భద్రతకు సంబంధించి పెన్షన్ ,వైద్య సౌకర్యం, పిల్లలకు విద్య, గృహ అద్దె భత్యం,గృహ నిర్మాణ అడ్వాన్స్ ,తక్కువ మొత్తంలో రుణాలు వంటి తదితర ప్రయోజనాలు ఏవి వారికి కల్పించడం లేదని లేఖలో పేర్కొన్నారు. 

డాక్ సేవక్ లకు పని భారం పెరగడంతో పాటుగా వేతనాలు,పని గంటల విషయంలో ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ నామ లేఖలో స్పష్టం చేశారు. ప్రభుత్వ పరంగా అందలిసిన పథకాలు వారికి వర్తింపచేయడం లేదని ,ఉద్యోగ విరమణ అనంతరం కూడా ఎటు వంటి పెన్షన్ కు వారు నోచుకోవడం లేదని గుర్తు చేశారు.

దీర్ఘకలికంగా గ్రామీణ డాక్ సేవక్ లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిస్కారించాలని కేంద్రమంత్రికి  వ్రాసిన లేఖలో ఎంపీ నామ నాగేశ్వరరావు గారు పేర్కొన్నారు.

- తమ సమస్యలపై తక్షణమే స్పందించిన ఎంపీ నామ గారికి గ్రామీణ డాక్ సేవక్ లు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

No comments:

Post a Comment