Pages

Monday, 4 June 2018

జి డి యెస్ ల ఆవేదన

Date : 4.6.2018

జి డి యెస్ ల ఆవేదన

క్షమించు అమ్మ...
కడుపున మోసిన నీకు..
కడుపు నిండా అన్నం పెట్టలేకున్నాను అమ్మ....
క్షమించు అమ్మ....

క్షమించు నాన్న....
అడుగులు నేర్పిన నీకు..
నడవలేకపోతుంటే నీకు తోడుగా ఉండలేకపోతున్నా నాన్న....క్షమించు నాన్న...

క్షమించు చెల్లమ్మ...
తొడబుట్టిన నీకు తోడు చూసి పెళ్లి చెయ్యలేకున్నా...
క్షమించు చెల్లమ్మ..
క్షమించు చెల్లెలా....

క్షమించు జీవిత భాగస్వామి..
నా జీవితంలో సగభాగమైన నీకు కష్టాలను తప్ప ఒక్క రోజు కూడా ప్రశాంతమైన జీవితాన్ని..
ఇవ్వలేని నన్ను క్షమించు...

క్షమించండి పిల్లలు..
నన్ను క్షమించండి...
మీరు కోరుకున్న బడి లో చదువు చెప్పించలేకపోయాను...
అందరిలా ఘనంగా శుభకార్యాలు చెయ్యలేనివాడిని...
క్షమించండి... నన్ను.!!

కన్న వారికి తోడుగా ఉండలేనివాడిని...
కట్టుకున్నవారికి భరోసా ఇవ్వలేని వాడిని...
తోడ బుట్టిన వారికి తోడుగా ఉండలేని వాడిని..
పుట్టిన వారిని ప్రయోజకుల్ని చెయ్యలేని వాడిని....

కష్టాలతో జీవనం చేసేవాడిని..
ఆశగా ఎదురుచూసే వాడిని..
నేనే జి డి యెస్ ని...
ఎక్కడా చూడని స్వాతంత్ర బానిసని....

కన్నీటి గాధలకి ముగింపు వస్తుందేమో అని ఆశతో...

మీ అమర శేషు

2 comments:

  1. Try to send in English translation to secretary posts, commu minister, pm

    ReplyDelete
  2. Good.& real expression. Heart touching. To persons having humanity. Ramarao R.

    ReplyDelete