Pages

Saturday, 2 June 2018

12 వ రోజు నిరవధిక సమ్మె

Date : 2.6.2018

12 వ రోజు నిరవధిక సమ్మె

ఎండిపోయిన బతుకులు ఎండని చూసి భయపడతాయా....
గాలిలో కలిసిపోతున్న జీవితాలు చూసిన వాళ్ళు ఈదురుగాలులకు వెనకడుగు వేస్తారా...
కన్నీటితో తడిచిన బతుకులు 
వర్షంలో తడవటానికి ఆలోచిస్తాయా.....

రానీ ఇంకెన్ని కష్టాలు వస్తాయో...ఎదురుకోటానికి మేము సిద్ధం అని దైర్యంగా ప్రకృతి కి సైతం ఎదురు నిలిచి 12 వ రోజు కూడా నిరవధిక సమ్మె ను విజయవంతం చేసిన జి డి యెస్ మిత్రులకి ధన్యవాదాలు.....

ఈ రోజు చాలా చోట్ల నారీమణులు సైతం నిరాహారదీక్ష లలో కూర్చోవడం జరిగింది.....
మరొక పక్క ఈ ప్రభుత్వ మొండి వైఖరి కి నిరసనగా దిష్టిబొమ్మను తగలుపెట్టడం వంటి వినూత్న కార్యక్రమాలు చెయ్యటం జరిగింది....
ఏది ఏమైనా ఈ నియంత ప్రభుత్వాన్ని ఎదురుకొంటున్న ఏకైక శక్తి మన జి డి యెస్ లే అని చాలామంది కితాబు ఇస్తున్నారు.....

మరొక పక్క ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అంటూ
జి డి యెస్ లే మూల స్తంభాలు అంటూ బుజ్జగిస్తూ డైరెక్టరేట్ అప్పీల్ పంపండం జరిగింది...

ఎవరు ఎన్ని చెప్పిన మన న్యాయమైన డిమాండ్ సాధించుకునే వరకు ఈ పోరాటం ఆపేది లేదని మరొక్కసారి తెలియచేస్తున్నాను...

విప్లవాభివందనాలతో
సి.హెచ్ లక్ష్మీ నారాయణ

No comments:

Post a Comment