Pages

Monday, 4 June 2018

14 వ రోజు నిరవధిక సమ్మె

Date : 4.6.2018

14 వ రోజు నిరవధిక సమ్మె

క్యాలెండర్ లో తేదీలు మారుతున్నాయి...
కానీ మా బతుకులలో మార్పు ఏది అని....
న్యాయం చేస్తారని చూపిన సహనం....
దాన్ని సాధించుకునే వరకు చూపించగలం...
కాకపోతే సహనానికి తెగింపు తోడయ్యింది.... 
విజయం సాధించేవరకు వెనకడుగు వేసేది లేదని నిరూపిస్తూ 14వ రోజు కూడా నిరవధిక సమ్మె ను విజయవంతం చేసిన 
జి డి యెస్ మిత్రులకి ధన్యవాదాలు.... 

ఈ రోజు ఉద్యమాల గడ్డ తెలంగాణ లో CPMG గారి ఆఫీస్ ముట్టడి అనేది చారిత్రాత్మకమైనది...
లోపలికి అనుమతించకపోవటం వల్ల ఎండలో రోడ్డు మీద బైఠాయించారు....
వారి పోరాటస్ఫూర్తి కి వందనాలు..

కొన్ని రోజులుగా విషాద ఘటనలు జరగటం బాధాకరం..
నిన్న వరహాల నాయుడు అనే జి డి యెస్ ర్యాలీ చేస్తుండగా గుండె పోటు తో మరణించడం జరిగింది...
ఆ విషాదాన్ని మరువకముందే
తిరుపతి లో రవి నాయుడు అనే
జి డి యెస్ ప్రాణం రాలిపోయింది...

వీటన్నిటికీ కంటే కూడా ఏలూరు లో ముత్యాల వెంకట స్వామి అనే జి డి యెస్ నాయకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం...
వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను...
అంతే కాకుండా వారి కుటుంబానికి తోడుగా ఉంటామని ఆర్థికసహయం చెయ్యటానికి కూడా వారిని సంప్రదించడం జరిగింది త్వరలో వివరాలు తెలియచేస్తాను...

జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మానవహక్కుల సంఘాలను(ఢిల్లీ) సంప్రదించడం జరిగింది.. 
ఎవరు కూడా అధైర్యపడవద్దు..
మీకు మేము ఉన్నాం అని తెలియచేస్తున్నాను...

ఇదే పొరాటపటిమతో రేపు కూడా వినూత్న నిరసన కార్యక్రమాలు చేపట్టి మన సమ్మె ను మరింత ఉదృతం గా చెయ్యాలని కోరుకుంటున్నాను..

విప్లవాభివందనాలతో
సి.హెచ్.లక్ష్మీ నారాయణ

2 comments:

  1. Sir don't cheat us! At any situation don't call off the strike, untill gds file get aproved.

    ReplyDelete
  2. One more comrades died in tamilnadu circle mr.Ravi arumugam Secretary aigdsu karaikudi division died in road accident after attending protest

    ReplyDelete