Date : 8.12.2019
జి.డి.యస్ లను IPPB నందు ఇన్సూరెన్స్ కొరకు Point of Sales Persons గా నియామకం.
IRDAI నిబంధనలు 2015 లోబడి పనిచేసే ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నింటితోటి IPPB టై - అప్ అవుతుంది. ఆయా కంపెనీలకు సంభందించిన జనరల్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను జి.డి.యస్ లు మరియు పోస్ట్ మ్యాన్ లు ప్రజల చేత చేయించవలసి వుంటుంది. ఈ ప్రక్రియ ను third party services అంటారు.
సరియైన మౌలిక సదుపాయాలు కల్పించకుండా, పూర్తి స్తాయి పని గంటలు ఇవ్వకుండా, ఎలాంటి సంక్షేమం ఏర్పాటు చెయ్యకుండా, ఇన్ని రకాల స్కీమ్ లను జి.డి.యస్ ల ద్వారా అమలు చెయ్యాలంటే ఎలా ?
ఎంతో మంది పార్లమెంట్ సభ్యుల ద్వారా సమస్యను శాసన శాఖ అయిన పార్లమెంట్ కి తీసుకు వెళ్ళినా ఉపయోగం లేదు. కార్యనిర్వాహక శాఖ అయిన పోస్టల్ డైరెక్టరేట్ కు అయితే జి.డి.యస్ లు గ్రహాంతర వాసులు గా కనపడుతున్నారు. ఇంక న్యాయ శాఖకు అయితే ఇలాంటి వారు వున్నారు అన్న సంగతే తెలియనట్టుగా " జి.డి.యస్ లు అంటే shop keepers,retired teachers,landlords etc.కాబట్టి వారికి ఎలాంటి సదుపాయాలు కల్పించాల్సిన అవసరం లేదు " అని తీర్పులు ఇస్తుంది.
ఈ పరిస్తితి మొత్తం ఒక్కసారి ఆలోచిస్తే మహా కవి శ్రీ శ్రీ గారి మహా ప్రస్థానం లోని బాటసారి గుర్తుకు వస్తుంది.
సి.హెచ్.లక్ష్మీ నారాయణ
కూటికోసం, కూలికోసం
పట్టణంలో బ్రతుకుదామని-
తల్లిమాటలు చెవిని పెట్టక
బయలుదేరిన బాటసారికి,
మూడురోజులు ఒక్కతీరుగ
నడుస్తున్నా దిక్కు తెలియక-
నడి సముద్రపు నావ రీతిగ
సంచరిస్తూ, సంచలిస్తూ,
దిగులు పడుతూ, దీనుడౌతూ
తిరుగుతుంటే-
చండ చండం, తీవ్ర తీవ్రం
జ్వరం కాస్తే,
భయం వేస్తే,
ప్రలాపిస్తే-
మబ్బుపట్టీ, గాలికొట్టీ,
వానవస్తే, వరదవస్తే,
చిమ్మచీకటి క్రమ్ముకొస్తే
దారితప్పిన బాటసారికి
ఎంత కష్టం!
కళ్ళు వాకిట నిలిపిచూచే
పల్లెటూళ్ళో తల్లి ఏమని
పలవరిస్తుందో…?
చింతనిప్పులలాగు కన్నుల
చెరిగిపోసే మంటలెత్తగ,
గుండుసూదులు గ్రుచ్చినట్లే,
శిరోవేదన అతిశయించగ,
రాత్రి, నల్లని రాతి పోలిక
గుండె మీదనె కూరుచుండగ,
తల్లిపిల్చే కల్ల ద్రుశ్యం
కళ్ళ ముందట గంతులేయగ
చెవులుసోకని పిలుపులేవో
తలచుకుంటూ-
తల్లడిల్లే,
కెళ్ళగిల్లే
పల్లటిల్లే బాటసారికి
ఎంత కష్టం!
అతని బ్రతుకున కదే ఆఖరు!
గ్రుడ్డి చీకటిలోన గూబలు
ఘూంకరించాయి..
వానవెలసీ మబ్బులో ఒక
మెరుపు మెరిసింది..
వేగు జామును తెలియజేస్తూ
కోడి కూసింది..
విడిన మబ్బుల నడుమనుండీ
వేగుచుక్కా వెక్కిరించింది..
బాటసారి కళేబరంతో
శితవాయువు ఆడుకుంటోంది!
పల్లెటూళ్ళో తల్లికేదో
పాడుకలలో పేగు కదిలింది!
Only one Union workings for welfare of GDS that is NUGDS.....
ReplyDeleteThanks for that Sir. ...
.