Pages

Sunday 8 December 2019

జి.డి.యస్ లను IPPB నందు ఇన్సూరెన్స్ కొరకు Point of Sales Persons గా నియామకం : తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి స్టేట్మెంట్

Date : 8.12.2019

జి.డి.యస్ లను IPPB నందు ఇన్సూరెన్స్ కొరకు Point of Sales Persons గా నియామకం : తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి స్టేట్మెంట్ 

చూస్తుండగానే ఒక్కొక్కటిగా చేరుతున్న స్కీమ్ లు అడ్డుకునే నాధుడే కరువయ్యారు

 ఏసీ గదుల్లో కూర్చుని టార్గెట్ లను  నిర్వహిస్తున్న  మహానుభావులకి పగలు రాత్రి తేడా లేకుండా పని చేయాలంటున్నారు 

తీసుకురండి ఇంకెన్ని స్కీములు తీసుకువస్తా రో జిడిఎస్ ల సహనానికి ఇంకా  ఎంతకాలం ఈ పరీక్ష పెడతా రో పెట్టండి చూద్దాం

ఏనాటికైనా
అతి గొప్ప భారత రాజ్యాంగం ద్వారా భారత చట్టాల ద్వారా భారత న్యాయస్థానాల ద్వారా నైనా నా సామాన్య జిడిఎస్ కి మేలు జరుగుతుంది అని ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాము

అయినా  మిమ్మల్ని అని ఏం ప్రయోజనం మా రాజా 
మా లో ఐక్యత లేనంత కాలం మా బతుకులు ఇంతే తగల పడతాయి వెట్టిచాకిరికి గురవుతాయి 

శ్రీశ్రీ గారు గనుక బ్రతికి ఉండి ఉంటే జిడిఎస్ ల చరిత్ర చూస్తూ ఉండి ఉంటే పోస్టల్ డిపార్ట్మెంట్ లోని అనగారిన జిడిఎస్ వర్గాల కష్టాలను రాయాలంటే నా కలం కదిలే పరిస్థితి లేదు వారి కన్నీటి చరిత్ర  నేను లిఖించ లేను అని చెప్పేవారు

కష్టాలను గుర్తించే వాడు మేధావి అయితే ఆ కష్టాలను తీర్చాలని ప్రయత్నం చేసేవాడు మహా మేధావి మహానుభావుడు వారికే మా జేజేలు.

సి హెచ్.కోటేశ్వర రావు

No comments:

Post a Comment