Date : 30.10.2019
Telangana Circle NUGDS Circle Secretary Press Statement.
ఖమ్మం పార్లమెంట్ సభ్యులు శ్రీ నామా నాగేశ్వరరావు గారిని ఎన్ యు జి డి ఎస్ నాయకులు రెండు దఫాలుగా కలిసి జిడిఎస్ ల సమస్యలపై వినతి పత్రం ఇచ్చిన సందర్భంలో అప్పుడు వారు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విధంగా జిడిఎస్ ల సమస్యలు పరిష్కరించాలని మంచి ఉద్దేశంతో నవంబర్ నెలలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల కు ఎనిమిది మందితో కూడిన ఎన్ యు జి డి ఎస్ ప్రతినిధులను వారి సొంత ఖర్చులతో ఢిల్లీకి తీసుకు వెళ్ళుటకు మరియు అక్కడ ఉండుటకు వసతి సముదాయాన్ని కూడా సిద్ధం చేసినారని తెలియజేసినారు. దానితో పాటుగా జిడిఎస్ ల సమస్యల పరిష్కారానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో నీ పార్లమెంటు సభ్యులను కలుపుకొని ప్రభుత్వాన్ని నిలదీస్తాం అని అలాగే ఎన్ యు జి డి ఎస్ నాయకుల కోరికమేరకు కమ్యూనికేషన్ శాఖ మంత్రివర్యులు శ్రీ రవిశంకర్ ప్రసాద్ గారి అపాయింట్మెంటు కు కూడా ఏర్పాట్లు చేసినాము అని తెలియజేశారు
గతంలో ఎన్నో ప్రజా సమస్యలను ను పార్లమెంటు దృష్టికి తీసుకువెళ్లిన నామ గారు జిడిఎస్ ల సమస్యలను వారి భుజాన వేసుకొని పరిష్కారానికై ప్రయత్నం చేయడం చాలా సంతోషకరం. దేశంలో ఉన్న రెండు లక్షల 75 వేల మంది జిడిఎస్ లు వారికి ఎప్పటికీ రుణపడి ఉంటారని తెలియజేస్తు ఈ సందర్భంగా ఈరోజు అనగా ది 29 10 2019 న ప్రెస్ మీట్ పెట్టి పత్రికాముఖంగా వారికి ధన్యవాదములు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ యు జిడిఎస్ రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరరావు ,ఎన్ యు పి ఈ రాష్ట్ర అధ్యక్షులు జి నాగేశ్వరావు గారు ,డివిజన్ కార్యదర్శులు బీ వీరన్న ,ఎండి sukur తదితరులు పాల్గొన్నారు.
Ch.Koteswara Rao
CS NUGDS TS Circle.
No comments:
Post a Comment