Pages

Saturday, 7 September 2019

PJCA Dharna infront of CPMG Offices, Vijayawada on 11.09.2019

Date : 07.09.2019

PJCA Dharna infront of CPMG Offices, Vijayawada on 11.09.2019.


#ఛలోవిజయవాడ

డియర్ CWC మెంబర్లు 
డివిజనల్ / బ్రాంచ్ కార్యదర్శులు 

సెంట్రల్ PJCA ( FNPO & NFPE ) పిలుపు మేరకు ది.11/09/2019 నాడు ఒక్క రోజు ధర్నా కార్యక్రమం CPMG ఆఫీస్ ముందు,విజయవాడ నందు నిర్వహించబడును.

#జి.డి.యస్ డిమాండ్లు : 

• RICT సమస్యలు పరిష్కరించాలని ,

• కమలేష్ చంద్ర కమిటీ సానుకూల సిఫార్సులును వెంటనే అమలు చెయ్యాలని, 

• జి.డి.యస్  మెంబర్షిప్ వెరిఫికేషన్ ను వెంటనే చేపట్టాలని, 

• కోర్ట్ ఆర్డర్ ప్రకారం జి.డి.యస్ సర్వీస్ ను కూడా పెన్షన్ చెల్లింపునకు పరిగణనలోనికి తీసుకోవాలని 

ఒక వైపున డిపార్ట్మెంట్ ను 6 బాగాలుగా విభజించే పనిలో కేంద్ర ప్రభుత్వం, ఇంకొక వైపున కామన్ సర్వీస్ సెంటర్ల పేరుతో గ్రామీణ తపాలా వ్యవస్థ ను రూపు రేఖలు లేకుండా చెయ్యాలన్న ధ్రుడ సంకల్పం తో కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ అడుగులు ముందుకు వెయ్యటం,మొత్తం గా మన ఉనికికే ప్రమాదం ఏర్పడిన పరిస్తితి ప్రస్తుతం మనం చూస్తున్నాం.

అసలు డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంటేగా,మనం అంటే  జి.డి.యస్ లు కమలేష్ చంద్ర కమిటీ సిఫారసులు అమలు చెయ్యండి అని అడగగలం. అదే విదంగా ఎంగేజ్మెంట్ రూల్స్ తొలగించండి అని అడగగలం.

కలిసికట్టుగా మన ఐక్యతను,పోరాట పటిమను డిపార్ట్మెంట్ కు అదే విదంగా కేంద్ర ప్రభుత్వానికి తెలియచెప్పి మనం కష్టపడి నిర్మించుకున్న ఈ సువిశాల ఇండియా పోస్ట్ సామ్రాజ్యాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

కాబట్టి మిత్రులారా, క్యాడర్ సంభందం లేకుండా పోస్టల్ ఉధ్యోగులు అందరూ ఈ ధర్నా కార్యక్రమం లో పాల్గొనాలని కోరుచున్నాము.

ధర్నాకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,డివిజనల్ /బ్రాంచ్  కార్యదర్శులు తప్పక హాజరు కాగలరు.

విజయవాడ కు దగ్గరగా ఉన్న ఏలూరు,తాడేపల్లి గూడెం,రాజమండ్రి, గుడివాడ,మచిలీపట్నం,తెనాలి,గుంటూరు,నరసరావుపేట,ప్రకాశం  నుండి అధిక సంఖ్య లో హాజరు కాగలరు.

డివిజన్ వారీగా సభ్యుల వివరములను రాష్ట్ర కార్యదర్శి కి తెలియచేయగలరు.

ఇట్లు 
మీ సోదరుడు 
సి.హెచ్.లక్ష్మీ నారాయణ



No comments:

Post a Comment