Pages

Friday, 31 July 2020

Clarification regarding financial assistance to GDS Employees infected with COVID-19.



Clarification regarding financial assistance to GDS Employees infected with COVID-19.

ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమన్నా ఉంటాదా ఈ లోకంలో? డబ్బులు మీవి కావు,ఫండ్ మీది కాదు. దీనికి ఇన్ని అనుమానాలు.

మేము నెల నెలా మా జీతంలో డబ్బులు రికవరీ చేసి మీ చేతుల్లో పెట్టడం ఏంటి? దానికి మీరు సవా లక్ష ప్రశ్నలు ఇయ్యటం ఏంటి?

అసలు ఈ కోవిడ్ - 19 కు హోమ్ క్వారంటైన్ లో ఉండి, కుటుంభం మొత్తం మందులు వాడితే ఎంత అవుతుందో ఈ క్లారిఫికేషన్ ఇచ్చిన అధికారికి తెలుసా?

అసలు ఎంతమంది హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకోవడానికి వీరు ఇచ్చే జీతాలు సరిపోతాయా? 

అసలు ఎవడు అడిగాడు మిమ్మల్ని ఈ 20,000 సదుపాయం కల్పించామని?సదుపాయం ఇచినట్లే ఇస్తారు,దానికి ఎన్నో కండిషన్లు చెప్తారు.

ట్రీట్మెంట్ తీసుకుంటే ,బిల్ ఎంతకు సబ్మిట్ చేస్తే అంత అంట లేకపోతే 20,000 అంట. ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే అది అంట.

ఒక వేళ ఇంటిలో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటే, హాస్పిటల్ బిల్ ఏమి సబ్మిట్ చెయ్యలేరు కాబట్టి, అలాంటి వారికి ఏమి ఇవ్వరు అం ట! 

ఎందుకు స్వామీ మా జీవితాలతో ఆడుకుంటారు?

జి.డి. యస్ నాయకత్వాలు వారి వారి స్వార్ధాలు చూసుకున్నంత వరకూ ,ఈ పరిస్థితి మారదు.

సి.హెచ్.లక్ష్మీ నారాయణ


No comments:

Post a Comment