Pages

Monday 15 April 2019

Union Declaration Form

Date : 15.04.2019

Union Declaration Form 



NUGDS ప్రస్థానం

మొట్టమొదటి ఇ.డి.యూనియన్ కోసం 1954 లో చెన్నైలో జరిగిన ఆల్ ఇండియా కన్వెన్షన్ నందునే మన ప్రియతమ నాయకులు కె.రామ్మూర్తి గారు డిమాండ్ చెయ్యటం జరిగింది. ఎట్టకేలకు 10.10.1968 నాడు మొట్టమొదటి ఇ.డి యూనియన్ అయిన NUEDA స్థాపించబడినది.

1977 లో సుప్రీం కోర్టు తీర్పు  " ED POSTS ARE CIVIL POSTS BUT OUT SIDE THE CIVIL SERVICES OF INDIA " వెనుక మన నాయకులు రామ్మూర్తి గారి క్రుషి ఎంతో  ఉంది. అప్పటి తీర్పును అనుసరించి ప్రస్తుతం రెండు కేసులు సెంట్రల్ CAT, డిల్లీ నందు ఉన్నవి. 1977 తీర్పుకు ముందు జి.డి.యస్ లకు సహజ న్యాయం ( Natural Justice) కూడా వర్తించేది కాదు. ఉదా, ఒక సబ్ డివిజినల్ అధికారి కూడా జి.డి.యస్ లను ఎలాంటి ఎంక్వైరీ లేకుండా డిస్మిస్ చేసిన సంధర్భాలు కూడా ఉన్నయి. 1977 తరువాత జి.డి.యస్ లకు ఒక ముఖ్య విషయం అయిన "security of service" ను పరిష్కారం చేసింది మాత్రం మన రామ్మూర్తి గారు మరియు NUEDA అని మనం గర్వంగా అందరికీ చేప్పుకోవచును.

జి.డి యస్ Wage structure, service conditions మరియు ట్రేడ్ యూనియన్ హక్కులను కూడా ILO ఫోరం, జెనివా
నందు  1984 లోనే కె.రామ్మూర్తి గారు ప్రోజెక్ట్ చేసినారు.

PJCA ఐక్యపోరాటాల ద్వారా మరియు రామ్మూర్తి గారి చొరవ వలన మాత్రమే 1987 సమ్మె నందు జి.డి.యస్ ల జీతభత్యాలు పెరిగినవి. DA, CDA, CMA, OMA, గ్రూప్ ఇన్సూరెన్స్ మొదలగునవి లభించినవి. 1985 సమ్మె ద్వారా మాత్రమే Subsistance allowance ( పుట్ ఆఫ్ డ్యూటీ నందు చెల్లించే అలవెన్సు ) ఇవ్వబడినవి. 1989/90 సమ్మెలు ద్వారా జి.డి.యస్ లకు బోనస్ సదుపాయం కల్పించబడినది. ఈ అన్నీ సమ్మెలలో ప్రధాన భూమిక పోషించింది మాత్రం మన రామ్మూర్తి గారు.

ఇది చరిత్ర.ఎవ్వరూ ఎన్ని కల్లి బోల్లి మాటలు చెప్పినా నమ్మవద్దు. మాదే మొట్టమొదటి యూనియన్ అని కొంత మంది ప్రచారం చేసుకుంటూ జి.డి.యస్ లకు ఆది నుండి ఇప్పటి వరకూ అంతా మేమే చేసాం అని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆది గురించి వివరంగా చెప్పుకున్నాం. తరువాత, ప్రస్తుతం మన NUGDS చేసిన, చేయ్యబోతున్న విషయాలు అన్నింటిని తదుపరి పొస్ట్ లో చర్చించుకుందాఁ.

అన్నీ వాస్తవాలు అందరి జి.డి.యస్ లకు చేరాలి.

సి హెచ్.లక్ష్మీ నారాయణ


జి.డి.యస్ జీవితాలలో      యన్.యు.జి.డి.యస్ పోషించిన క్రియాశీలక పాత్ర.

2013 లో డిపార్ట్మెంట్ RD,SB టార్గెట్ పేరుతో ఉరుకులు పరుగులు పెట్టిన సంగతి అందరికీ తెలిసినదే. ఆ సమయం లో CPMG ద్వారా "TRCA అలవెన్సులను రివిజన్ " చేసే విదంగా ఆర్డర్ తీసుకు రావటం జరిగింది. 3సం,ల రివ్యూతో సంభంధం లేకుండా ఇంటిరమ్ ఆర్డర్ ద్వారా అత్యధిక అకౌంట్స్ ఓపెన్ చేసిన BPM లు అందరికీ స్కేల్ రివైజ్ అయ్యి ఎక్కువ మంది 5 వ స్కేల్ TRCA తీసుకోవటానికి ఆ ఆర్డర్ ఉపయోగపడింది.

2013 నుండి బయో మెట్రిక్ పరికరాల ద్వారా వ్రుద్దాప్య, వితంతు,వికలాంగుల పెన్షన్ పంపిణీ అదే విధంగా MGNREGS వేజ్ సీకర్లు కు నగదు పంపిణీ బ్రాంచ్ పోస్టాఫీసు ల ద్వారా చేపట్టటం జరిగింది.

 13.02.2014 న NUGDS రాష్ట్ర సంఘం A). File no.5-1/2007 WS- (pt) dated 16.12.2010  B).SB order no.9/2013  C). File no.25/10/2005-FS (volume) dated 24.06.2013 ఆర్డర్స్ ప్రకారం SSP పేమేంట్ చేస్తున్న అకౌంట్ను  SB అకౌంట్  గానే పరిగణించి,జి.డి యస్ ల పని భారం లోనికి తీసుకోవాలి అని CPMG ని  కోరడం జరిగింది.

అధికారులతో ఇదే విషయం  గురించి ఎన్నో దఫాలుగా చర్చలు జరపగా చివరిగా Item no.16-01/2014 of RJCM meeting ద్వారా 1.12.2014 న సోషల్ సెక్యూరిటీ పెన్షన్ పంపిణీని జి.డి.యస్ ల పని భారం లోనికి తీసుకోవడం జరిగింది. ఈ ఆర్డర్ ద్వారా దాదాపుగా 60% మంది బి పి.యమ్ ల జీతాలు 5 వ  స్కేలు కు చేరినవి.

వీటి గురించి ఎందుకు ఇప్పుడు ప్రస్తావన అని చాలామందికి ఆలోచన రావచ్చు. ఏదైతే మనం ఇప్పుడు GDS Conduct &Engagement Rules,2011 కి సంభందించిన రూల్ 3(i) రద్దు కావాలని కోరుతున్నామో దానిని శాస్త్రీయంగా RTI సమాచారం ద్వారా ఎక్కువ శాతం జి.డి.యస్ లు 5 గం,లకు మించి పని చేస్తున్నారు అని నిరూపించటానికి పైన పేర్కొన్న రెండు ఆర్డర్స్ చాలా ముఖ్య పాత్ర పోషించాయి. ఈ రెండు ఆర్డర్స్ తీసుకు రావటానికి అప్పటి ఉమ్మడి సర్కిల్ గ్రూప్ సి కార్యదర్శి శ్రీ.వాసిరెడ్డి శివాజీ గారు మరియు అప్పటి గ్రూప్ సి ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ శ్రీ.డి కిషన్ రావ్ గారు ఎంతగానో క్రుషి చేసారు.దానికి నిదర్శనం SSP ఆర్డర్ RJCM ద్వారా లభించడం.

ఇది అంతా ఒక వైపు. నేషనల్ యూనియన్ లు చేసిన పని 2013, 2014 సం,లలో.

రెండవ వైపున so called recognised GDS union చేపట్టిన కార్యక్రమాలు క్రింద చర్చిద్దాం.

2014 లో మహదేవయ్య గారు డిపార్ట్మెంట్ కు ఒక లెటర్ వ్రాయటం జరిగింది. దాని సారాంశం ఏంటీ అంటే ఫెడరేషన్ లు జి.డి.యస్ సమస్యలు చర్చించ కూడదు పలానా వాల్యుమ్ ప్రకారం అని. జి.డి.యస్ లు ఫెడరేషన్ లుతో కలిసి వుండి వారి సమస్యలు పరిష్కారం అయితే మీ మనుగడ కి ఎక్కడ ప్రమాదం వస్తుందో అని కంగారు పడి వాల్యూమ్ ల మీద వాల్యూము లు తిరగేసి డైరెక్టరేట్ కు లెటర్ వ్రాసే బదులు దాని కొసం కేటాయించిన సమయంలో కొద్ది సమయం జి.డి.యస్ ల కొసం కేటాయిస్తే వీరి జీవితాలు మారుతాయి అని వారికి అన్పించిక పోవటం హాస్యాస్పదం.

మరి కేంద్ర స్తాయి లో ఆలా వుంటే,వారికి మేము ఏమీ తీసిపోము అన్నట్లుగా వారి రాష్ట్ర సంఘం 1డిశెంబరు 2014 న  SSP ఆర్డర్ వెలువడితే 7 డిశెంబరు 2014 నాడు ఒక సమ్మె నోటీసు ఇచ్చి,అందులో SSP లను జి డి.యస్.పని భారం లోనికి తీసుకోవాలి అని డిమాండ్ పెడతారు.

గుర్తింపు మరియు ఆధిపత్య  పోరు తో ఆ  సంఘం. 
జి డి.యస్ వ్యవస్థ లో వెట్టిచాకిరీ నిర్మూలన కొరకు NUGDS.


కాబట్టి మిత్రులారా అందరూ నిశితంగా అన్నీ విషయాలు గమనించడం చాలా ముఖ్యం. 

సరియైన నాయకత్వం, సంఘం లో లేకపోవడం వలన జరిగే నష్టం కంటే కూడా అసమర్థత నాయకత్వం, సంఘం లో ఉండటం వలన ఎక్కువ నష్టం కలుగుతుంది.

నేషనల్ యూనియన్ కట్టుబడి ఉంది !

జి.డి.యస్ లకు 8 గం,ల పని విధానం కల్పించేవిధంగా పోరాటం చెయ్యటానికి !

NUGDS కట్టుబడి ఉంది !

ఇచ్చిన మాట మీద నిలబడి ఉండడానికి !

సి హెచ్.లక్ష్మీ నారాయణ

No comments:

Post a Comment