Pages

Monday, 15 August 2016

Date : 15.8.2016


PM INDEPENDENCE DAY SPEECH



బ్యాంకుల్లా పోస్టాఫీసులుః ప్రధానమంత్రి

న్యూఢిల్లీః దశాబ్దాల చరిత్ర కలిగిన పోస్టాఫీసులు.. త్వరలో రూపాంతరం చెందనున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసులు పేమెంట్ బ్యాంకుల్లా మారనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. 70వ స్వాతంత్రదినోత్సవ సందర్భంలో దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని.. ఈ విషయాన్ని తెలిపారు. దేశంలో వినూత్నంగా ఆరంభించనున్న పోస్టల్ పేమెంట్ బ్యాంకులు అందించే థర్డ్ పార్టీ సేవలు ప్రజా ప్రయోజనాలకు ఎంతగానో సహకరిస్తాయని ప్రధాని పేర్కొన్నారు.

దేశంలో అతిపెద్ద నెట్వర్క్ కలిగిన తపాలా శాఖపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, టెక్నాలజీ అభివృద్ధితో పోస్టాఫీసులు అసంబద్ధంగా మారాయని, అయితే ప్రభుత్వం వాటిని వినియోగంలోకి తెచ్చే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.

No comments:

Post a Comment